హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎంపీపీ స్కూల్లో పర్యావరణ అవగాహన

ELR: గణపవరం ఎంపీపీ నెంబర్-1 పాఠశాలలో గురువారం పర్యావరణ పరిరక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. హెచ్ఎం నారాయణ మాట్లాడుతూ.. రాబోయే వినాయక చవితికి మట్టి వినాయకులనే పూజించాలని, దీనివల్ల భక్తితో పాటు పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందన్నారు. విద్యార్థులచే 'మట్టి విగ్రహాలు ముద్దు, కెమికల్ విగ్రహాలు వద్దు' అని నినాదాలు చేయించారు. ఉచితంగా మట్టి విగ్రహాలను అందజేశారు.