హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గూడూరులో 'పొలం పిలుస్తోంది'

కృష్ణా: గూడూరు (మం) కాంచకోడూరులో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఏవో జీ. శివరామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రైతులకు పంటల సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆధునిక సాగు పద్ధతులు, ఎరువుల వినియోగం, చీడపీడల నివారణపై అవగాహన కల్పించారు. రైతులు శాస్త్రీయ పద్ధతులు పాటించాలని ఏవో సూచించారు.