హైదరాబాద్: 28°C
వార్తలు

సీఎం విజయ్ నేతృత్వంలో కూటమి నేతల సమావేశం

తమిళనాడు సీఎం విజయ్ నేతృత్వంలో కూటమి నేతల సమావేశం జరిగింది. ఈ భేటీకి కాంగ్రెస్, వీసీకే, ఎండీఎంకే, ఐయూఎంఎల్ నేతలు హాజరయ్యారు. మరో మిత్ర పక్షాలైన వామపక్షాలు మాత్రం ఈ సమావేశానికి దూరంగా ఉన్నాయి. వచ్చే నెల 6న జరగనున్న 2 ఉపఎన్నికల అభ్యర్థుల ఖరారు, అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధానంగా చర్చించారు. మరోవైపు ఇప్పటికే ఈ ఉపఎన్నికల అభ్యర్థులను డీఎంకే ప్రకటించింది.