KDP: పిల్లలకు టీకాలు తప్పనిసరిగా వేయించాలని DMHO డా.యుగంధర్ సూచించారు. సిద్ధవటం (మం) మాధవరం-1లోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో బుధవారం ఇమ్యునైజేషన్ కార్యక్రమాన్ని తనిఖీ చేశారు. పుట్టినప్పటి నుంచి రెండేళ్లలోపు పిల్లలకు ప్రాణాంతక వ్యాధుల నివారణకు టీకాలు వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు. బుధ, శనివారాల్లో టీకాల కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
పిల్లలకు టీకాలు తప్పనిసరి: DMHO


