హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పెన్షన్ దరఖాస్తులపై కలెక్టర్ సమీక్ష

ప్రకాశం: పెన్షన్ల దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియపై మార్కాపురం జిల్లా కలెక్టర్ విజయ సునీత అధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించారు. స్వర్ణ గ్రామ, వార్డు కార్యాలయాల్లో దరఖాస్తుల స్వీకరణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సూచించారు. లబ్ధిదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.