హైదరాబాద్: 28°C
వార్తలు

బుల్లెట్ రైలు ఢీకొని భార‌తీయ మ‌హిళ మృతి

జపాన్‌లో నర్సింగ్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న కేరళ యువతి దేవిక బుల్లెట్ రైలు ఢీకొని మృతి చెందింది. జపాన్ నుంచి తమ కూతురి మృతదేహాన్ని తీసుకువచ్చే స్తోమత లేదని బాధిత తల్లిదండ్రులు వాపోతున్నారు. దీంతో ఆ దేశంలోని కేరళ సంఘం దేవిక దహనసంస్కరాలను హిందూ సంప్రదాయం ప్రకారం నిర్వహించనున్నట్లు చెప్పింది. తమ కూతురికి ఆ తల్లిదండ్రులు వీడియో కాలింగ్ ద్వారా వీడ్కోలు పలకనున్నారు.