హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణానికి భూమిపూజ

అన్నమయ్య: ఓబులవారిపల్లి (మం) బాలిరెడ్డిపల్లిలో విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణానికి ముక్కా రూపానందరెడ్డి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నూతన విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణం వలన రైతులకు లో-వోల్టేజ్ సమస్య లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా అవుతుందని అన్నారు. గ్రామాలలో మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని తెలిపారు.