హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సిగ్నల్స్ లేక లబ్ధిదారుల ఇబ్బందులు

ASR: అరకు మండలం నందివలస రేషన్ డిపో వద్ద సిగ్నల్స్ లేక కార్డుదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రేషన్ బియ్యం తీసుకునేందుకు బయోమెట్రిక్ తప్పనిసరి కావడంతో సిగ్నల్స్ కోసం 2 కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సి వస్తోందని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజంతా బియ్యం కోసం వేచి ఉండాల్సి వస్తోందన్నారు. బయోమెట్రిక్ సమస్యకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు.