హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పృథ్వీశ్వరస్వామి వారి దేవస్థానంలో భస్మాభిషేకం

కృష్ణా: చల్లపల్లి మండలంలోని నడకుదురులో ఉన్న శ్రీ పృథ్వీశ్వరస్వామి వారి దేవస్థానంలో స్వామివారికి భస్మాభిషేకం నిర్వహించారు. ఆలయ సమగ్ర అభివృద్ధి ప్రదాత మండవ రవీంద్ర ఆధ్వర్యంలో భక్తుల భాగస్వామ్యంతో స్వామివారికి 108కిలోల భస్మంతో అభిషేకం, అమ్మవారికి 108 కిలోల కుంకుమతో అభిషేకం, అలంకరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన వంశ పారంపర్య అర్చకులు కంఠంరాజు సాయిబాబు పాల్గొన్నారు.