హైదరాబాద్: 28°C
వార్తలు

మద్యపాన నిషేధం ఎత్తివేతపై సీఎం క్లారిటీ

బీహార్‌లో కొన్నేళ్లుగా కొనసాగుతున్న మద్యపాన నిషేధాన్ని ఎత్తేస్తారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. దీనిపై సీఎం సామ్రాట్ చౌదరి క్లారిటీ ఇచ్చారు. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. ఈ నిషేధాన్ని మాజీ సీఎం నితీశ్ కుమార్ అమలు చేసినప్పటి నుంచి రాష్ట్రంలోని సగం మంది ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు. అంతేకాకుండా క్రైమ్ రేటు కూడా తగ్గిందని తెలిపారు.