హైదరాబాద్: 28°C
వార్తలు

రీల్స్‌తో పరువు తీస్తోందని కన్నతండ్రే..

గుజరాత్ అహ్మదాబాద్‌లో పరువు హత్య ఘటన చోటుచేసుకుంది. సోఫియా అనే అమ్మాయి ఓ ఆసుపత్రిలో రిసెప్షనిస్ట్‌గా పని చేస్తోంది. ఆమెకు సంబంధించిన ఓ రీల్ 3 నెలల క్రితం తెగ వైరల్ అయింది. రీల్స్‌తో తమ పరువు తీస్తోందని భావించిన తండ్రి, సోదరుడు కలిసి ఆమెను చంపేశారు. దీనిని ప్రమాదంగా చిత్రీకరించాలని చూశారు. చివరకు పోలీసుల విచారణలో విషయం తెలియడంతో తండ్రి, కొడుకును అరెస్ట్ చేశారు.