హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చల్లపల్లిలో సేంద్రీయ సాగు పరిశీలన

కృష్ణా: చల్లపల్లిలో వీ.కరుణాకర్‌ సేంద్రీయ పద్ధతుల్లో సాగు చేసి పండించిన వివిధ వ్యవసాయ ఉత్పత్తులను విజయ డైరీ మాజీ ఛైర్మన్ చలసాని ఆంజనేయులు బుధవారం పరిశీలించారు. నేటి సమాజంలో సేంద్రీయ ఉత్పత్తులకు ఎంతో ప్రాధాన్యత ఆంజనేయులు ఉందన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు భూమి సారాన్ని, పర్యావరణాన్ని పరిరక్షించేందుకు సేంద్రీయ వ్యవసాయాన్ని మరింత ప్రోత్సహించాలన్నారు.