పంజాబ్ ఆర్థిక మంత్రి హర్పాల్ చీమా రాజీనామా చేయాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం భగవంత్ మాన్ చర్యలు తీసుకోవాలన్న విజ్ఞప్తి చేశారు. పంజాబ్‌లో మాదక ద్రవ్యాల సరఫరాపై మంత్రిని నిలదీసిన గుల్జార్ సింగ్ అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాను మంత్రిని ప్రశ్నించినందుకు తనను వేధిస్తున్నారని ఆత్మహత్యకు ముందుు గుల్జార్ సింగ్ వీడియో విడుదల చేశారు.
వార్తలు
పంజాబ్ ఆర్థిక మంత్రి రాజీనామా చేయాలి: రాహుల్


