హైదరాబాద్: 28°C
క్రీడలు

సచిన్ తొలి సెంచరీకి 32 ఏళ్లు పూర్తి

క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ 1994 సెప్టెంబర్ 9 సరిగ్గా ఇదే రోజు తన తొలి వన్డే సెంచరీ సాధించాడు. కొలంబోలో ఆస్ట్రేలియాతో జరిగిన ట్రై సిరీస్‌లో 21 ఏళ్ల సచిన్, 130 బంతుల్లో 110 పరుగులు చేసి భారత్‌ను 31 పరుగుల తేడాతో గెలిపించాడు. 1989లో అరంగేట్రం చేసిన ఆయన, తన 79వ వన్డేలో ఈ మైలురాయిని అందుకోవడం విశేషం. సచిన్ కెరీర్‌లో 49 ODI సెంచరీలున్నాయి.