హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు డయల్ యువర్ ఆర్టీసీ డీఎం

W.G: తణుకు ఆర్టీసీ డిపో పరిధిలో సమస్యలు, సలహాల స్వీకరణకు ‘డయల్ యువర్ డీఎం’ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు డీఎం సుధారాణి తెలిపారు. గురువారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు 99592 25484 నంబర్‌కు ఫోన్ చేసి వివరాలు తెలపవచ్చని పేర్కొన్నారు. ఆర్టీసీ సేవలను మరింత మెరుగుపరిచేందుకు ప్రయాణికులు, ఉద్యోగులు, విద్యార్థులు సలహాలు ఇవ్వాలని సూచించారు.