మహారాష్ట్రలో నలుగురి మృతికి కారణమైన పులి మరణించింది. అటవీశాఖ అధికారులు మత్తుమందు ఇచ్చి పట్టుకున్న కొద్దిసేపటికే పులి ప్రాణాలు విడిచింది. పారత్వాడలోని అటవీశాఖ కేంద్రంలో చికిత్స అందిస్తుండగా పరిస్థితి విషమించి ఈ విషాదం చోటుచేసుకుంది. కాగా.. అమరావతి, వర్ధా జిల్లాల్లో ఈ పులి వరుస దాడులతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన విషయం తెలిసిందే.
వార్తలు
నలుగురిని చంపిన పులి.. చికిత్స పొందుతూ మృతి


