హైదరాబాద్: 28°C
వార్తలు

యూకేలో విమానాలు రద్దు.. భారత్‌పైనా ఎఫెక్ట్‌

యూకేలో ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ వ్యవస్థలో తలెత్తిన సాంకేతిక సమస్య ప్రభావం భారత విమానయాన సంస్థలపైనా పడింది. యూకేకు రాకపోకలు సాగించే తమ విమాన సర్వీసుల్లో అంతరాయం కలిగిందని ఎయిరిండియా సహా పలు దేశీయ విమానయాన సంస్థలు తెలిపాయి. మంగళవారం పలు విమానాలను రద్దు చేయగా.. మరికొన్ని ఆలస్యమయ్యాయని ఎయిరిండియా తెలిపింది. ఈ అంతరాయం ఇవాళ కూడా కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది.