PLD: జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో కాకతీయనగర్ స్వాగత ద్వారం వద్ద కాలువలో పూడిక పేరుకుపోవడంతో నెల రోజులుగా మురుగునీరు రోడ్డుపై ప్రవహిస్తోంది. దుర్గంధంతో స్థానికులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సిబ్బంది వచ్చి పరిశీలించిన పరిష్కారం కాలేదని స్థానికులు చెబుతున్నారు. ఉన్నతాధికారుల స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుచున్నారు .
ఆంధ్రప్రదేశ్
నరసరావుపేటలో రోడ్డుపైనే మురుగు నీరు..!


