హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పేరుకుపోయిన చెత్త.. చర్యలు ఏవి..!

KDP: సిద్ధవటం మండలం మాధవరం-1లోని రోడ్ నంబర్ 13 పాత పంచాయతీ కార్యాలయం వద్ద చెత్త పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతోంది. దీంతో స్థానికులు, రాకపోకలు సాగించే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి చెత్తను తొలగించి పరిసరాలను శుభ్రం చేయాలని స్థానికులు కోరుతున్నారు.