హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అర్ధవీడులో బురదమయంగా మారిన రోడ్డు

ప్రకాశం: అర్ధవీడు(M) పాపినేనిపల్లిలో వర్షపునీరు రోడ్డుపై నిలిచిపోవడంతో బురదమయంగా మారింది. సైడ్ కాలువలు లేకపోవడంతో చిన్నపాటి వర్షానికి రోడ్లపై నీరు నిలిచి దోమల బెడద పెరిగిందని, అలాగే రోడ్లపై మురుగునీరు చేరి దుర్వాసన వెదజల్లుతుందన్నారు. దీంతో జ్వరాల బారిన పడే అవకాశం ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలన్నారు.