హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చోరీకి గురైన రూ.4.50 లక్షల బైక్‌ రికవరీ

కర్నూల్ నాలుగవ పట్టణ పోలీసుల పరిధిలో చోరీకి గురైన రూ.4.50 లక్షల విలువైన రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ జీటీ బైక్‌ను పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు మైనర్లు బైక్‌ను అపహరించినట్లు సీఐ విక్రమ్‌సింహ తెలిపారు. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించి బైక్‌ను రికవరీ చేసినట్లు పేర్కొన్నారు. అనంతరం వాహనాన్ని యజమానికి అప్పగించారు.