హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అలర్ట్.. పలు రైళ్లు రద్దు

NLR: గూడూరు- విజయవాడ రైల్వేస్టేషన్ల మధ్య నడిచే పలు మెము రైళ్లను ఈ నెల 16, 17, 18 తేదీల్లో రద్దు చేసినట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. 17, 18 తేదీల్లో 67259 విజయవాడ- బిట్రగుంట, 67260 బిట్రగుంట- గూడూరు మధ్య నడిచే వాటిని రద్దు చేశారు. 16, 17 తేదీల్లో 67225 విజయవాడ- గూడూరు, 15, 18 తేదీల్లో 67226 గూడూరు- విజయవాడ, 17259 నెల్లూరు- విజయవాడ మెము రైలు నిలిపివేసినట్లు వివరించారు.