హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆర్టీసీలో డ్రైవర్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం

NLR: ఉదయగిరి ఆర్టీసీ డిపోలో ఆన్ కాల్ డ్రైవర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డిపో మేనేజర్ రమేష్ కుమార్ బుధవారం ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు. హెవీ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండి, లైసెన్స్ పొందిన తేదీ నుంచి 18 నెలలు పూర్తయిన వారు అర్హులన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈనెల 15వ తేదీ లోపు డిపోలో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.