హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు వైసీపీ సమావేశం

NLR: వైసీపీ కోవూరు నియోజకవర్గస్థాయి సమావేశాన్ని బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని ఎం ఎం ఫంక్షన్ హాల్లో నిర్వహించనున్నారు. ఈ సమావేశం మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి అధ్యక్షతన జరుగుతుందని నిర్వాహకులు తెలియజేశారు. ఈ సమావేశానికి నియోజకవర్గ వ్యాప్తంగా వైసీపీ నేతలు కార్యకర్తలు అందరూ తరలిరావాలన్నారు.