ELR: పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో ప్రమాదవశాత్తు కార్మికుడు మృతి చెందాడు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన బోనమాలి పాయక్ (32) వెల్డర్‌గా పని చేస్తున్నాడు. ట్విన్ టన్నల్స్ వద్ద సెంట్రింగ్ ఐరన్ రాడ్లు విప్పుతుండగా సెంట్రింగ్ మొత్తం ఊడిపడటంతో ఐరన్ రాడ్ శరీరంలోకి దూసుకెళ్లింది. తీవ్రంగా గాయపడిన బోనమాలి పాయక్ అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
పోలవరం ప్రాజెక్టులో కార్మికుడి మృతి


