హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కనిగిరి మున్సిపల్ పీఠంపై ఉత్కంఠ

ప్రకాశం: కనిగిరి మున్సిపాలిటీ ఎన్నికలపై రాజకీయ చర్చ జోరందుకుంది. 2021లో వైసీపీ అన్ని వార్డుల్లో విజయం సాధించి షేక్ అబ్దుల్ గఫార్ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఎన్డీఏ కూటమి అధికారంలో ఉండడంతో ఛైర్మన్ పీఠం దక్కించుకునేందుకు టీడీపీ వ్యూహాలు రచిస్తోంది. కూటమి దూకుడును వైసీపీ ఎలా ఎదుర్కొంటుందనేది ఆసక్తికరంగా మారింది.