GNTR: అగతవరపాడు సమీపంలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు మంగళవారం మెరుపు దాడి చేశారు. ఈ దాడిలో ఏడుగురు పేకాటరాయుళ్లను పట్టుకుని, వారి నుంచి రూ.10,720 రోక్కంతో పాటు 7 ఫోన్లు, 4 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటోను జప్తు చేశారు. కేసు నమోదు చేసి తదుపరి విచారణ నిమిత్తం నిందితులను పెదకాకాని పోలీసులకు అప్పగించారు.
ఆంధ్రప్రదేశ్
పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ దాడి..!


