హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు వైసీపీ నియోజకవర్గ స్థాయి సమావేశం

CTR: పలమనేరులోని వైసీపీ కార్యాలయంలో ఇవాళ ఉదయం 10 గంటలకు పార్టీ నియోజకవర్గ స్థాయి సమావేశం జరుగుతుందని స్థానిక పార్టీ కార్యాలయ నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే వెంకటే గౌడతోపాటు జిల్లా పార్టీ అధ్యక్షుడు భూమన కరుణాకర రెడ్డి హాజరై పార్టీ శ్రేణులకు స్థానిక ఎన్నికలపై దిశా నిర్దేశం చేస్తారని వెల్లడించారు.