హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఓటర్ల జాబితాలో ఫోటోల సవరణకు ఆదేశాలు

బాపట్ల జిల్లా ఓటర్ల జాబితాలో ఫొటోలు సరిగా లేకపోతే బీఎల్‌వోలే స్వయంగా ఫొటోలు తీయించాలని జిల్లా కలెక్టర్ డా. వినోద్ కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి వీసీ ద్వారా ఈఆర్‌వోలు, మున్సిపల్ కమిషనర్లు, తహశీల్దార్లు, బీఎల్‌వోలతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఓటర్ల నమోదు, మార్పులకు సంబంధించిన ఫారం 6, 7, 8 దరఖాస్తులను పెండింగ్ లేకుండా త్వరగా పూర్తి చేయాలన్నారు.