హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'కూటమి పాలన అకృత్యాలకు నిలయంగా మారింది'

KKD: కూటమి పాలన అకృత్యాలకు నిలయంగా మారిందని వైసీపీ గోదావరి జిల్లాల ఇన్‌ఛార్జ్ బొత్స సత్యనారాయణ ఆరోపించారు. మంగళవారం కాకినాడ రూరల్లోని జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. డ్వాక్రా మహిళలను సైతం మోసం చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని విమర్శించారు. మాటలు కోటలు దాటుతున్నప్పటికీ పనులు మాత్రం జరగడం లేదని ఆరోపించారు.