హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పింఛన్ దరఖాస్తుల గడువు పెంచాలి'

W.G: పింఛన్ల ఆన్‌లైన్ దరఖాస్తులో సాంకేతిక సమస్యలు, దరఖాస్తు పత్రాల కొరత వంటి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని గడువును మరో నెల రోజులు పొడిగించాలని దళిత డప్పు కళాకారుల సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కళింగ లక్ష్మణరావు కోరారు. మంగళవారం తాడేపల్లిగూడెంలో ఆయన ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో దళిత డప్పు కళాకారులకు ఇబ్బందికరంగా మారిందన్నారు.