E.G: ఆదాయం లేని చిన్న ఆలయాలు, పూజారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ధూప దీప నైవేద్యం (DDNS) పథకం కింద నెలకు రూ.10,000 ఆర్థిక సహాయం అందించనున్నట్లు రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మంగళవారం తెలిపారు. నియోజకవర్గంలోని అర్హత కలిగిన ఆలయాలు పథకానికి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అర్హతలు, అవసరమైన పత్రాలతో తన కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
ఆలయాలకు నెలకు రూ.10 వేల సాయం:బత్తుల


