హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అంబులెన్స్ ఢీకొని ఇద్దరి యువకులు మృతి

E.G: పెరవలి మండలం పిట్టలవేమవరంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. స్థానికుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన నేలపూడి ప్రదీప్ (25), కానూరు అగ్రహారం గ్రామానికి చెందిన హరిదాసు సాయి(24) బైక్‌పై వెళ్తుండగా అంబులెన్స్ ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వారిని తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందారు.