BPT: బల్లికురవ మండలం వల్లపల్లి గ్రామంలో మంగళవారం రాత్రి ఎస్సై నాగరాజు పల్లె నిద్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో సమావేశం నిర్వహించి సైబర్ నేరాలు, మహిళలపై జరిగే నేరాలు, రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు. అలాగే రాబోయే వినాయక చవితి ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
నేరాలపై అవగాహన కలిగి ఉండాలి: ఎస్సై


