హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పెళ్లైన మరుసటి రోజే యువకుడి మృతి

WG: పెరవలి మండలం పిట్టలవేమవరంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. అదే గ్రామానికి చెందిన నేలపూడి ప్రదీప్ (25), కానూరు అగ్రహారానికి చెందిన హరిదాసు సాయి(24) బైక్‌పై వెళుతుండగా వడలి నుంచి రాజమండ్రి వెళుతున్న అంబులెన్స్ ఢీకొట్టింది. అయితే ప్రదీప్‌కు సోమవారం వివాహం కాగా, మరుసటి రోజే మృతి చెందడం ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.