హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈనెల 11న మండల ప్రజా పరిషత్ సమావేశం: MPDO

SRPT: అనంతగిరి మండల ప్రజా పరిషత్ సమావేశాన్ని ఈ నెల 11న ఉదయం 11 గంటలకు ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించనున్నట్లు అనంతగిరి ఎంపీడీవో సుష్మా మంగళవారం సాయంత్రం ఓ ప్రకటనలో తెలిపారు. మండల ప్రత్యేక అధికారి అధ్యక్షతన జరిగే సమావేశానికి సర్పంచులు, వివిధ శాఖల మండల స్థాయి అధికారులు, పంచాయతీ కార్యదర్శులు తప్పనిసరిగా హాజరుకావాలని సూచించారు.