E.G: రాజమండ్రి నగరంలో వయోజన విద్య, అక్షరాస్యత ప్రాధాన్యంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని నగర కమిషనర్ రాహుల్ మీనా సూచించారు. మంగళవారం రాజమండ్రి నగరపాలక సంస్థ కార్యాలయంలో వయోజన విద్యాశాఖ అధికారులతో సమావేశమయ్యారు. అక్షరాస్యతను సామాజిక ఉద్యమంగా ముందుకు తీసుకెళ్లేందుకు అన్ని వర్గాల భాగస్వామ్యం అవసరమని కమిషనర్ పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'అక్షరాస్యతపై అవగాహన పెంచాలి'


