SRPT: సూర్యాపేట రూరల్ సర్కిల్ పరిధిలోని రామన్నగూడెం గ్రామంలో మంగళవారం ఆత్మకూరు(ఎస్) పోలీసులు తనిఖీలు నిర్వహించి 104 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు యువకులను అరెస్ట్ చేసి రెండు ఫోన్లు, మోటార్ సైకిల్ సీజ్ చేసినట్లు రూరల్ సీఐ రాజశేఖర్ మీడియాకు తెలిపారు. నిందితులపై ఎన్టీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
తెలంగాణ
గంజాయి స్వాధీనం.. ఇద్దరు యువకుల అరెస్ట్


