హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'కూటమి ప్రభుత్వం పెన్షన్లను రద్దు చేసింది'

VSP: కూటమి ప్రభుత్వం 6.20 లక్షల పెన్షన్లను రద్దు చేసి, 26 నెలలుగా కొత్త పెన్షన్లు మంజూరు చేయలేదని మాజీ మంత్రి బూడి ముత్యాలనాయుడు ఆరోపించారు. మంగళవారం మద్దిలపాలెం వైసీపీ కార్యాలయంలో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసమే ఇప్పుడు 7 రోజుల్లో దరఖాస్తుల స్వీకరణ డ్రామా మొదలుపెట్టారని, ఎన్నికల హామీలు అమలు చేయకుండా, ధరలు పెంచి ప్రజలను మోసం చేస్తున్నారన్నారు.