రానున్న ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు సహకరించాలని కొయ్యూరు సీఐ బీ.శ్రీనివాసరావు కోరారు. నిన్న రాత్రి రేవళ్లు గ్రామంలో పర్యటించారు. గ్రామస్తులతో సమావేశమయ్యారు. ఎన్నికల్లో ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా బాధ్యతగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా, శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులకు సహకరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల్లో ప్రలోభాలకు దూరంగా ఉండాలి: సీఐ


