హైదరాబాద్: 28°C
తెలంగాణ

వైభవంగా నీలకంటేశ్వరస్వామి రథోత్సవ వేడుకలు

MBNR: పట్టణంలోని వీరన్నపేటలో కొలువైన శ్రీ నీలకంటేశ్వరస్వామి రథోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నీలకంటేశ్వరుడికి పుష్పాలంకరణ, అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేకపూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం స్వామివారి రథోత్సవ ఊరేగింపు భక్తుల జయ జయ ధ్వనుల మధ్య పట్టణంలోని ప్రధాన వీధుల గుండా కొనసాగింది.