హైదరాబాద్: 28°C
తెలంగాణ

అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ప్రభుత్వ పథకాలు రద్దు: SP

ADB: తలమడుగు మండలంలోని ఉమ్రి గ్రామంలో మంగళవారం నిర్వహించిన పోలీసులు మీకోసం కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ.. గ్రామస్తులు గంజాయి, మద్యం, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ప్రభుత్వ పథకాలు రద్దు చేయడం జరుగుతుందని గ్రామస్తులకు ఎస్పీ హెచ్చరించారు.