హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు 45 ఉద్యోగాలకు జాబ్ మేళా

బాపట్ల నేషనల్ మార్టులో 45 ఉద్యోగాలకు గురువారం జాబ్ మేళా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కొత్త బస్టాండ్ సమీపంలోని సాయిబాబా గుడి పక్కన నూతన మార్టులో ఉద్యోగాలు ఉన్నాయన్నారు. పది నుంచి డిగ్రీ వరకు అర్హత కలిగిన 32 ఏళ్లలోపు వారు అర్హులన్నారు. జీతం రూ.16,363తో పాటు ఈఎస్ఐ, పీఎఫ్, బీమా సౌకర్యాలు ఉంటాయన్నారు.