హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డిగ్రీ అడ్మిషన్లు.. 10లోగా కాలేజీల్లో చేరాలి

ASR: ఏపీ డిగ్రీ కళాశాలల్లో సీట్లు పొందిన విద్యార్థులు ఈనెల 10లోపు కేటాయించిన కళాశాలల్లో రిపోర్ట్ చేయాలని పాడేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్.సత్యనారాయణ తెలిపారు. ఏపీసీహెచ్‌ఈ డిగ్రీ సీట్ల అలాట్‌మెంట్ ఫలితాలు విడుదల చేసిందన్నారు. విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో సకాలంలో హాజరై అడ్మిషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని సూచించారు.