హైదరాబాద్: 28°C
తెలంగాణ

తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలి: కలెక్టర్

KMM: ఎల్‌నినో ప్రభావంతో తక్కువ వర్షపాతం నమోదవుతున్న నేపథ్యంలో గోదావరి, సాగర్‌ జలాలను తాగునీటి అవసరాలకు ప్రాధాన్యతనిస్తూ వినియోగించాలని కలెక్టర్‌ దివాకర టీఎస్‌ ఆదేశించారు. మంగళవారం పల్లెగూడెం NSP కాలువ పనులు, వి.వెంకటాయపాలెం డీప్‌కట్‌ వద్ద నీటి పరిస్థితిని పరిశీలించారు. తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.