హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పేరూరు ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేయాలి'

ATP: ఉమ్మడి జిల్లాలోని పేరూరు, బైరవానితిప్ప ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే పరిటాల సునీత కోరారు. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి వినతిపత్రం అందించారు. ప్రాజెక్టుల కింద కాలువల తవ్వకాలు, లిఫ్టుల ఏర్పాటు, భూములిచ్చిన రైతులకు పరిహారం కోసం నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.