కృష్ణా: రానున్న వేసవి వరకు జిల్లాలో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. అందుబాటులో ఉన్న నీటి వనరులను బాధ్యతగా వినియోగిస్తూ నీటి వృథాకు ఎలాంటి అవకాశం ఇవ్వకూడదన్నారు. మంగళవారం తన క్యాంప్ ఆఫీస్ నుంచి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు.
ఆంధ్రప్రదేశ్
తాగునీటి సమస్య రానివ్వకండి: కలెక్టర్


