హైదరాబాద్: 28°C
వార్తలు

ALERT: ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

AP: రాష్ట్రంలో ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉంది. అల్లూరి, పోలవరం, అనకాపల్లి, కృష్ణా, NTR, గుంటూరు, బాపట్ల, పల్నాడు, TPT, మార్కాపురం, NLR, చిత్తూరు జిల్లాల్లో చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.