VSP: భాద్రపద మాసం ప్రారంభం కావడంతో పెళ్లి బాజాలకు తాత్కాలిక విరామం వచ్చింది. ఈ మాసాన్ని శూన్య మాసంగా భావిస్తారు కాబట్టి, అక్టోబర్ 10 వరకు దాదాపు 34 రోజుల పాటు వివాహాలు, గృహప్రవేశాలు వంటి శుభకార్యాలు ఉండవు. ఈ విరామ సమయంలో నామకరణాలు, అక్షరాభ్యాసాలు, సీమంతాలు వంటి చిన్న కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చని శైవగామ పండితులు గంగవరపు పార్వతీశ్వర శర్మ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
నేటి నుంచి శుభకార్యాలకు బ్రేక్


