హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు కొత్తమ్మ తల్లి ఉత్సవాలపై సమావేశం

SKLM: వచ్చే నెల 13 నుంచి మూడు రోజులపాటు జరగనున్న కోటబొమ్మాళి కొత్తమ్మతల్లి వార్షిక ఉత్సవాల నిర్వహణపై ఇవాళ  సమావేశం నిర్వహిస్తున్నట్లు తహసీల్దార్ ప్రసాదరావు తెలిపారు. టెక్కలి ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి అధ్యక్షతన ఉదయం 10 గంటలకు తహసీల్దార్ కార్యాలయంలో సమావేశం జరుగుతుందన్నారు. ఉత్సవాలకు భక్తుల రద్దీ, భద్రత, తాగునీరు తదితర ఏర్పాట్లపై చర్చించనున్నారు.